ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

PPM: వీరఘట్టం మండల కేంద్రంలో ఉన్న ఎరువుల షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ షాపులో రిజిస్టర్, ఈపాస్, మిషన్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్సులు సరిగ్గా అప్డ్‌డేట్ చేయకపోవడంతో రూ. 9.74 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేయాలని ఏడీ రత్నకుమారి, ఏవో సౌజన్య యజమానికి సూచించారు. నిషేధిత పురుగులు మందులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు.