'ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి'
W.G: ఇరగవరం మండలం కంతేరు ఆర్అండ్‌బీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఎం నేత కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రహదారిపై నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు. యుద్ధప్రతిపాదికన సిమెంట్ లేదా తారు రోడ్డు నిర్మించాలన్నారు.