నేడు దువ్వూరులో సర్వసభ్య సమావేశం
KDP: దువ్వూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సభా భవనంలో సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుబ్బారెడ్డి ఆదివారం తెలిపారు. ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. మండల ఎంపీటీసీలు సర్పంచులు సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.