బ్యాంకులూ.. రుణాల్లో జాగ్రత్త!
రుణాల తుది వినియోగాన్ని నిర్ధారించకపోతే ఆర్థిక అవకతవకలు జరుగుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బ్యాంకులు ప్రజా ధనాన్ని నిర్వహిస్తాయని, ఉద్యోగులు విధుల్లో అత్యంత బాధ్యతగా ఉండాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. లోన్లను మంజూరు చేసిన ఉద్దేశం కాకుండా ఇతర వాటికి వాడటం ఇబ్బందులకు దారితీస్తుందని, సిబ్బంది క్రమశిక్షణతో ఉండాలని స్పష్టం చేసింది.