బాలుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ASF: తిర్యాణి మండలం ఉల్లి పిట్ట గ్రామంలో 2023లో జరిగిన బాలుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జడ్జి జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ప్రేమ పేరుతో వ్యక్తిని హెచ్చరించినందుకు బాలుడిని హత్య చేశారని బాధితుడి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా జడ్జి వారికి శిక్ష విధించారన్నారు.