VIDEO: నర్సరీలో ఎండిన చెట్లు!
ADB: గాదిగూడ మండలం దాబా(బి) గ్రామపంచాయతీలోని నర్సరీ నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతిని కాపాడుకునేందుకు మొక్కలు నాటాలని ఉద్దేశించిన నర్సరీ ఇప్పుడు ఎండిపోయిన సంచుల సముదాయంగా మారింది. నీటి కొరత, సంరక్షణ లేకపోవడంతో చాలా మొక్కలు ఎండిపోతున్నాయి. అధికారులు, నూతన పాలకవర్గం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.