నేటి నుంచి గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు

SRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పథకం కింద సూర్యాపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలం ఎంపికైంది. మండలంలోని సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు బృందం గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తు స్వీకరించి పరిష్కరించనున్నారు. మండలంలో నేటి నుంచి ఈ నెల 12 వరకు సదస్సులు కొనసాగనున్నాయి.