రాయదుర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే
ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగం, కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను MLA కాలవ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. అధికారులతో కలిసి రోడ్ల నాణ్యతను తనిఖీ చేసి, నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.