అన్న క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన ఎమ్మెల్యే
ATP: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను గుంతకల్లు పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కేక్‌ను కట్ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్‌కి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.