VIDEO: తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు

VIDEO: తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు

వరంగల్ నగరంలోని ఆరేపల్లిలో ఉన్న విజ్ఞాన భారతి విద్యాలయంలో నేడు 10వతరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న సందర్భంగా తల్లిదండ్రుల ఆశీస్సులు పొందేందుకు ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం నిర్వహించింది. విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేసి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.