'రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి'
ASF: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, రవాణా,తూనికలు కొలతలు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వానాకాలం 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోలు, ఏర్పాట్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.