కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించండి: వినోద్

SS: కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హిందూపురంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్‌కు పెండింగ్‌లో ఉన్న 5 నెలల జీతాలు చెల్లించి ఈఎస్ఐ, PF సౌకర్యం కల్పించాలని కోరారు.