ప్రజలు సరైన ఆహారం తీసుకోవాలి: DMHO
PDPL: ప్రజలు తమ ఆహారంలో సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకోవాలని DMHO డా. ప్రమోద్ కుమార్ సూచించారు. ఇవాళ ఆయన ఫుడ్ సేఫ్టీ డే లో భాగంగా పెద్దపల్లి ITI నుంచి ఆసుపత్రి వరకు నిర్వహించిన ఈట్ రైట్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 11 వరకు ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళా, హోటల్స్ తనిఖీ కార్యక్రమాలు చేపడతామన్నారు.