పెరిగిన చెట్లు.. పట్టించుకోని అధికారులు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం నుంచి కంటాయపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో నిత్యం వివిధ పనులను వెళ్లే ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెట్ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు.