పార్టీ అభివృద్ధికి కృషి చేయండి: జగన్

KDP: మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ అధినేత వైయస్ జగన్ సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.