VIDEO: మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష
KKD: పిఠాపురంలో మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో రూ.60 కోట్లు, గొల్లప్రోలులో రూ.80 కోట్లతో అమృత్ పథకమంతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. రెండేళ్ళలో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, పార్కులు, వీధిలైట్లు 100% పూర్తి చేస్తామన్నారు.