VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. స్థానికులు ఆవేదన

VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. స్థానికులు ఆవేదన

కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గుత్తులవారిపాలెం వెళ్లేదారిలో విద్యుత్ వైర్లు మనిషి ఎత్తు కన్నా కింద నుంచి వెళ్లడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొంథా తుఫాన్ గాలులకు విద్యుత్ స్తంభం వంగిపోయి ఉండడంతో అధికారులు వైర్లను తాత్కాలికంగా అమర్చారని, తర్వాత దానిని మరిచారని చెబుతున్నారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.