VIDEO: సొసైటీ వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన
MHBD: గూడూరు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. 15 రోజులుగా కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహంతో రైతులు గురువారం కార్యాలయంలోకి దూసుకెళ్లి సిబ్బందిని నిర్బంధించారు. ఖాళీ బస్తాల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.