ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ!

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ!

ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా 16 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఇందులో 10 MQ-9 రీపర్ డ్రోన్లు, దాడుల్లో దెబ్బతిన్న మరో 6 విమానాలు ఉన్నాయి. కువైట్ రక్షణ వ్యవస్థ పొరపాటున జరిపిన దాడిలో 3 F-15 ఫైటర్ జెట్లు కూలగా, ఇరాన్ దాడుల్లో 5 KC-135 ట్యాంకర్ విమానాలు ధ్వంసమయ్యాయి. US సైనిక సామర్థ్యానికి ఇది పెద్ద సవాలుగా మారింది.