కస్తూర్బాలో అడ్మిషన్లు ప్రారంభం

కస్తూర్బాలో అడ్మిషన్లు ప్రారంభం

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని రావిళ్ళవారిపాలెం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆరవతరగతి, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగమణి సోమవారం తెలిపారు. ఆరవ తరగతిలో 40, ఇంటర్ బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.