ఖైరతాబాద్ వెళ్తున్నారా.. అలర్ట్

HYD: ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధం అవడంతో అక్కడికి వచ్చే భక్తుల కోసం బారికేడ్లు రూఫ్ టాప్‌లు సిద్ధం చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గణపయ్య దర్శనానికి వస్తుండటంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం తర్వాత ఈ ట్రాఫిక్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ రూట్లో వెళ్లేవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే మంచిది.