'భట్టి విక్రమార్క కేవలం శంకుస్థాపనలకే పరిమితమైయ్యారు'
KMM: మధిర 21వ వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థి పరిస నాగలక్ష్మి తరపున మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ముమ్మర ప్రచారం చేశారు. సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి ఇంటికి తిరిగిన ఆయన, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, అభివృద్ధి శూన్యమని విమర్శించారు.