కొత్త బురుజులో సీఎం ప్రజా సభ కార్యక్రమం
NDL: డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తొలుత రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.