రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గొట్టిపాటి
BPT: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం, భక్తి భావాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ కృపతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ఉండాలని అన్నారు.