'పేదల సంక్షేమానికి పెద్ద పీఠవేస్తాం'

MBNR: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా పేదల సంక్షేమానికి ప్రభుత్వం విలువ ఇస్తుందన్నారు.