పందుల బెడదపై స్పందించిన కమిషనర్

పందుల బెడదపై స్పందించిన కమిషనర్

KDP: బద్వేల్ పట్టణంలో పందుల బెడద అధికంగా ఉండటంతో కాలనీ వాసులు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్, పందులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అధికారులు పందుల యజమానులతో మాట్లాడి, 13వ వార్డు నుంచి వాటిని తరలించేలా చర్యలు తీసుకున్నారు.