వెనిగండ్లలో పారిశుద్ధ్యం సమస్య
GNTR: వెనిగండ్ల గ్రామంలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జొన్నల వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరుస వర్షాల వల్ల కాలువలు పూడికతో నిండిపోవడం, కొత్త ఇళ్ల నిర్మాణాల కారణంగా రోడ్లపై కంకర, ఇసుక పేరుకుపోయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆయన తెలిపారు. దీంతో దోమలు పెరిగి ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని వాపోతున్నారు.