రక్తదానంతో ప్రాణం కాపాడిన కానిస్టేబుల్
SDPT: సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మేడారం ప్రాంతానికి చెందిన రోగికి అత్యవసరంగా 'ఓ పాజిటివ్' రక్తం అవసరమని తెలిసి వెంటనే స్పందించారు. రక్తనిధి కేంద్రానికి చేరుకుని రక్తదానం చేయడంతో రోగికి సమయానికి చికిత్స అందింది.