తిరుమలయ్య గుట్టలో ప్లాస్టిక్ నిర్మూలన
WNP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రముఖ సామాజికవేత్త పోచ రవీందర్ రెడ్డి మిత్ర బృందంతో కలిసి వనపర్తి సమీపంలోని తిరుమలయ్య గుట్టలో ప్లాస్టిక్ బాటిల్‌ను సంచులను తొలగించారు. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు విలువైన ఔషధ మూలికలతో కలిగి ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తిరుమల గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రవీందర్ రెడ్డి కోరారు.