VIDEO: ఆచూకీ కోసం గాలిస్తున్న DRF సిబ్బంది

HYDలో ఆదివారం కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన మామ,అల్లుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గం వినోదానగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన సన్నీ అనే యువకుడు కోసం DRF సిబ్బంది గాలిస్తున్నారు. సన్నీ అనే యువకుడి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.