నిజామాబాద్ జిల్లా మార్క్ ఫెడ్ డీఎం బదిలీ
నిజామాబాద్ జిల్లా మార్క్‌ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ మహేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా మార్క్‌ఫెడ్‌కు డీఎంగా పదోన్నతి పొందారు. ఆయన స్థానంలో క్రాంతి పదోన్నతిపై నూతన డీఎంగా నియమితులయ్యారు. పంటల మద్దతు ధర కొనుగోళ్లు, ఎరువుల పంపిణీలో మార్క్‌ఫెడ్ కీలక పాత్ర పోషిస్తుంది. నూతన అధికారి రైతులకు మెరుగైన సేవలు అందించలని జిల్లా రైతాంగం కోరుతోంది