AMC ఛైర్మన్ పదవిపై జనసేన నేత స్పందన ఇదే.!

కృష్ణా: గన్నవరం AMC చైర్మన్ పదవి వివాదంపై నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు స్పందించారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. AMC చైర్మన్ TDPకి వెళ్లడం పట్ల జనసేన ప్రముఖ నేతకు ధనం ముట్టిందని వార్తల ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో జనసేనకి ఇచ్చినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదన్నారు. ఎవరు డబ్బులు తీసుకున్నారో చెప్పాలన్నారు.