నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరం: సీఐ
మహబూబాబాద్ పట్టణంలో నేరాల నియంత్రణ కోసం ప్రతి అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి సూచించారు. బుధవారం “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా యాదాద్రి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై షాకీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.