'మంచినీటి పథకం పూర్తి చేసి ప్రజల ఆశలు నెరవేరుస్తాం'
PLD: వినుకొండ పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శాశ్వత తాగునీటి ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. NSP కాలువ నుంచి పైపులైన్ ద్వారా సింగర చెరువుకు నీటిని మళ్లించి, పట్టణానికి ప్రతిరోజూ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.