విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి..!

విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి..!

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.