తూర్పువీధిలో నేడు శ్రీ హనుమజ్జయంతి ఉత్సవం

TPT: గూడూరు పట్టణంలోని తూర్పువీధిలో గురువారం శ్రీ హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా జరగనున్నది. ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, విశేష అలంకరణ, పూజలు, తీర్థప్రసాదాలు వితరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, రాత్రి 7:30 గంటలకు విద్యుద్దీపాలంకరణలతో స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభంగా జరుగుతుందని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.