VIDEO: మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన
WGL: వర్ధన్నపేట పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీలో వాటర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఓర్సు మల్లయ్య (60) దుర్మరణం పాలయ్యారు. విధుల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో నిద్రించేందుకు బైక్ పై వెళ్తుండగా, పుర కార్యాలయం సమీపంలో కారు ఢీ కొట్టడంతో ఆయన మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యలు మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉంచి ఆందోళనకు దిగారు.