'ఆధార్ సేవలు అందుబాటులోకి తేవాలి'

'ఆధార్ సేవలు అందుబాటులోకి తేవాలి'

KDP: ఆధార్ సేవలను అందుబాటులోకి తేవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అధికారులను కోరారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఆధార్ సేవలు అందడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని, గత కొంత కాలంగా ఆధార్ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.