కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మల్యేకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.