ముంబై దాడుల తరహాలో కుట్ర..!

ముంబై దాడుల తరహాలో కుట్ర..!

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై దాడుల తరహాలో ఢిల్లీలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఇందుకోసం 200 బాంబులను తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.