సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న రవీంద్ర కుమార్

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న రవీంద్ర కుమార్

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు అడిషనల్ సోలిటర్ జనరల్, మాజీ రాజ్యసభ సభ్యులు రవీంద్ర కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.