ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 7 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ప్రతిపక్ష ఆప్ మూడు స్థానాలను గెలిచింది. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒకటి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ మరొకటి సొంతం చేసుకున్నాయి. వీటితో కలిపి మొత్తం 122 స్థానాలు బీజేపీకి, 102 స్థానాలు ఆప్‌కు ఉన్నాయి.