జనసమీకరణపై జాగ్రత్త సూచన: జేసీ
ATP: జిల్లాలో దేవాలయాలు, జాతరలు వంటి పెద్ద పండగల సమయంలో జన సమీకరణ జరిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జేసీ శివనారాయణ శర్మ సూచించారు. ఎక్కడెక్కడ జన రద్దీ ఉంటుందో గుర్తించి పోలీసు, వైద్య, అగ్నిమాపక శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో రద్దీ ఉన్న ఆలయాలపై అధికారులు తగిన నివేదికలు పంపాలని జేసీ ఆదేశించారు.