'దేశానికి అంబేద్కర్ ఎనలేని సేవలు'
VZM: భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 69వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. మాజీ DCC అధ్యక్షులు, AICC సభ్యులు సరగడ రమేష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.