శ్రీశైలంలో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం

శ్రీశైలంలో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం

NDL: మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం కనులపండువగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తరించిపోయారు. అనంతరం ఆలయ ప్రధాన గోపురంపై కలశానికి తలపాగా చుట్టే 'పాగాలంకరణ' కార్యక్రమం కనువిందుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.