గోడ కూలిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక

గోడ కూలిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక

AP: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనపై ఇవాళ  ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ నివేదిక అందజేయనుంది. త్రిసభ్య కమిషన్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసింది. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో ఈ కమిషన్.. 20 మందిని విచారించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.