శ్రీధర్ రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు
RR: గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశ్యంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.