కృష్ణా బోర్డు సమావేశానికి సన్నాహాలు

కృష్ణా బోర్డు సమావేశానికి సన్నాహాలు

జనవరిలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేఆర్‌ఎంబీకి కొత్త ఛైర్మన్‌గా ఎస్.బిశ్వాస్‌ను నియమించింది. ఈ క్రమంలో జనవరిలో బోర్డు సమావేశాన్ని ప్రతిపాదిస్తూ.. తెలంగాణ, ఏపీకి లేఖలు పంపింది. సమావేశం ఎజెండా కోసం నెలాఖరులోపు అంశాలు పంపాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది.