'రేషన్ ను సక్రమంగా పంపిణీ చేయాలి'

ATP: కళ్యాణదుర్గం మండలం మౌక్తికాపురం గ్రామంలో ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంత బాబు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ కార్డుదారులు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.