VIDEO: గొర్రెల కాపరి పై పెంపుడు కుక్క దాడి..!
MHBD: కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బొడ్డు చంద్రయ్యపై బుధవారం అతని పెంపుడు కుక్క దాడి చేసింది. జంగాలపల్లి పాడు అడవిలో గొర్రెలను మేపుతూ ఉండగా కుక్క వెటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకుంది. కుక్కను బయటకు తీసే ప్రయత్నంలో బెదిరిన కుక్క చంద్రయ్యపై దాడి చేయడంతో అతని చేతికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన చంద్రయ్యను స్థానికులు ఆసుపత్రికు తరలింపు.